ఆసుపత్రిలో టాలీవుడ్ హీరో.. అసలేమైంది ?

by Prasanna |   ( Updated:2022-11-22 05:58:25.0  )
ఆసుపత్రిలో టాలీవుడ్  హీరో.. అసలేమైంది ?
X

దిశ, వెబ్ డెస్క్ : 'ప్రేమదేశం' సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరస అవకాశాలతో అబ్బాస్ బిజీ ఇపోయారు. అయితే అబ్బాస్ హీరోగా మెయిన్ లీడ్ రోల్ చేసిన సినిమాలు చాలా తక్కువ. తన కెరియర్లో సెకండ్ హీరోగా చేసిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి. దాని వల్ల ఇతనికి హీరోగా తక్కువ అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అబ్బాస్ విదేశాల్లో మోటివేషనల్ క్లాసెస్ చెప్పుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు. భవిష్యత్తులో ఇక పై సినిమాల్లో ఇంక కనిపించనని అబ్బాస్ ఎప్పుడో వెల్లడించారు. ప్రస్తుతం అబ్బాస్‌కు సంభందించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఆ ఫోటోలో తన నడవలేని స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. నా కుడి కాలికి ఆపరేషన్ జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను, చికిత్స అయి పోయిన తర్వాత ఇంటికి వెళ్తాను.. నా కోసం ప్రార్థించిన వారందరికి చాలా ధన్యవాదాలు అని అబ్బాస్ వెల్లడించాడు. అబ్బాస్ త్వరగా కోలుకొని ఇంటికి చేరుకోవాలని కోరుకుందాం.

Advertisement

Next Story