చంద్రమోహన్ చివరి మాటలు ఇవే.. కన్నీరు పెట్టించిన కామెంట్స్

by Nagaya |   ( Updated:2023-11-11 09:00:28.0  )
చంద్రమోహన్ చివరి మాటలు ఇవే.. కన్నీరు పెట్టించిన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : మద్రాస్‌లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నటుడు చంద్రమోహన్ 70 ఏళ్ల పాటు తన నటన జీవితాన్ని కొనసాగించారు. వ్యవసాయ శాఖలో పని చేసిన చంద్రమోహన్ సినిమాలపై మక్కువతో మద్రాసుకు చెక్కేశారు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అక్కడే ఉండటంతో తెలుగు నటులతో కలిసి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. చంద్రమోహన్ నటన నచ్చిన బీఎన్ రెడ్డి హీరోగా తొలిసారి అవకాశం ఇచ్చారు. అంజలిదేవి, వాణిశ్రీ నటించిన ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

కాగా, ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రమోషన్ టాలీవుడ్‌లో జరుగుతున్న వరుస మరణాలపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సీనియర్ ఆర్టిస్టుల్లో నేనొక్కడినే ఉన్నాను. నా ముందు బ్యాచ్ అంతా వెళ్లిపోయింది. ఇటీవల నా కొలీగ్స్ అయిన కృష్ణ, కృష్ణంరాజు కూడా వెళ్లిపోయారు. ఆ నాటి మేల్ యాక్టర్స్‌లలో నేనే మిగిలాను’ అని ఆయన విచారం వ్యక్తం చేశారు. హీరోయిన్లలో వాణిశ్రీ, శారద, జయసుధ ఇలా కొంత మంది ఉన్నా మేల్ ఆర్టిస్ట్‌లో నేను ఒక్కడినే మిగిలానని అన్నారు. నేను హీరో కృష్ణ ఒకేసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మరణించిన సందర్భంగా టాలీవుడ్ నటులు ఆయన చెప్పిన ‘నేనొక్కడినే మిగిలాను..’ మాటలు గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

Read More..

శ్రీదేవికి మొదటి అవకాశం ఇచ్చింది చంద్రమోహన్‌నే.. 16 ఏళ్ల వయసులోనే..!

Advertisement

Next Story

Most Viewed