Vijay Antony : నేడు బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని పుట్టిన రోజు

by Jakkula Samataha |
Vijay Antony : నేడు బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని పుట్టిన రోజు
X

దిశ, సినిమా : నేడు నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ పుట్టినరోజు. ఈయన కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్‌లో 1975 జూలై24న జన్మించాడు. ఈరోజు విజయ్ పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా బర్త్‌‌డే విషెస్ చెబుతున్నారు.

ఇక ఈయన క్రైమ్ థ్రిల్లర్ నాన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించగా, సలీలో హీరోగా, సంగీత దర్శకుడిగా చేశారు. విజయ్‌కు ఏ సినిమాల ద్వారా అంత ఫేమ్ రాలేదు కానీ, బిచ్చగాడు సినిమాతో ఒక్కసారిగా విజయ్ ఆంటోని జాతకమే మారిపోయింది. సంగీత దర్శకుడిగా మొదలైన ఈయన లైఫ్ బిచ్చగాడు సినిమాతో మరో మలుపు తిరిగిందని చెప్పవచ్చు.

బిచ్చగాడు మూవీ తెలుగు తమిళ భాషల్లో సంచలనం సృష్టించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా బిచ్చగాడు 2 కూడా తెరకెక్కించారు. కానీ ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక బిచ్చగాడు మూవీ తర్వాత విజయ్ అనేక సినిమాల్లో నటించారు. కానీ ఆయనకు ఏ సినిమాలు అంత పెద్ద సక్సెస్‌ను ఇవ్వలేదు.

Advertisement

Next Story