Gopi Sundar : నేడు మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ పుట్టిన రోజు

by Hamsa |   ( Updated:2023-05-30 14:40:28.0  )
Gopi Sundar : నేడు మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్  పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ పుట్టిన రోజు మే 30 1977లో జన్మించారు. గాయకుడిగానే కాకుండా నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సురేష్ బాబు మరియు లివి దంపతులకు జన్మించిన సుందర్ తన బాల్యంలో ఎక్కువ భాగం కొచ్చిలో గడిపాడు . సుందర్ నోట్‌బుక్‌తో ఫిల్మ్ స్కోర్ కంపోజర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ఫ్లాష్ కోసం సౌండ్‌ట్రాక్ కంపోజిషన్ కోసం సిబి మలైల్ ఆఫర్ ఇచ్చాడు. పలు చిత్రాల్లో పాటలకు మ్యూజిక్ అందించాడు. ఎక్కువగా సుందర్ తెలుగు, తమిళం పాటలకు సంగీతం అందించాడు. అంతేకాకుండా 2010లో ‘అన్వర్’ అనే మలయాళ చిత్రానికి గోపీ సుందర్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌ వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: మే-30: నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు

Advertisement

Next Story