నేడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు

by Prasanna |
kajal agarwal
X

దిశ, సినిమా: హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి.. నేడు స్టార్ హీరోయిన్ వరకు ఎదిగింది. బాలీవుడ్ ‘క్యూ హో గయా నా’ మూవీలో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. తెలుగులో దర్శకుడు తేజ్ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయమై సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దాదాపు 15 ఏళ్లుగా కెమెరా ముందు మెరుస్తున్న కాజల్ స్టార్ హీరోలందరితోనూ నటించింది. 50 చిత్రాల మార్క్‌ను దాటిన కథానాయికగా కూడా ఆమె పేరు పొందింది. నేడు తన 39 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నటీ నటులు ఆమె బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Advertisement

Next Story