హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. స్నేహారెడ్డికి క్యూట్ విషెష్ తెలిపిన బన్నీ

by Anjali |   ( Updated:2024-03-09 14:16:48.0  )
allu-sneha
X

దిశ, సినిమా: టాలీవుడ్‌‌లో బెస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు సంపాదించుకున్న వారిలో హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ స్నేహారెడ్డి ఒకరు. పెళ్లై పదమూడేళ్లైన వీరు ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అల్లు అర్జున్- స్నేహా ప్రేమ వివాహం చేసుకుని.. అయాన్, అర్హలకు జన్మనిచ్చారు. స్నేహ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.

ఈమె సినిమాల్లో నటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ లెవల్ లో ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇకపోతే నేడు స్నేహారెడ్డి- అల్లు అర్జున్ నేడు మ్యారేజ్ యానివర్సరీ ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బన్నీ ట్విట్టర్ వేదికన ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘మన పెళ్లై 13ఏళ్లు గడిచింది. నేను ఈ పొజిషన్ లో ఉండటానికి నీతో బంధమే కారణం.

నీ ప్రశాంతమైన మనసు నుంచి నాకు ఎంతో శక్తినిచ్చావు. ఇలానే మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ క్యూటీ’’ అంటూ అల్లు అర్జున్ భార్యతో దిగిన పిక్‌ను జోడించి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అలాగే వీకి పెళ్లి ఫొటోలు కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు అల్లు అర్జున్- స్నేహారెడ్డికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story