‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా?

by Anjali |   ( Updated:2023-10-14 09:41:28.0  )
‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
X

దిశ, సినిమా: మాస్ మహారాజ రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీలో రేణు దేశాయ్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన మూవీ టీం.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 15న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed