Sai Dharam Tej : '#SDT 15' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

by Vinod kumar |   ( Updated:2022-12-04 12:55:38.0  )
Sai Dharam Tej :  #SDT 15 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. రీసెంట్‌గా తన 15వ చిత్రాన్ని ఎన్‌టీఆర్ చేతుల మీదుగా ప్రకటించగా కార్తీక్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏమిటంటే.. ఈ మూవీ నుంచి ఈ డిసెంబర్ 7న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు ఓ ఆసక్తికర పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంస్కృతంలో ఆసక్తికరమైన వాఖ్యం ఉంది. 'సిద్ధార్థీ నామ సంవత్సర బృహస్మృతి సింహరాసౌ స్థిత నామయే అంతిమ పుష్కరే' అని రాసి ఉంది. ఇంకో పోస్టర్‌లో ఒక చక్రానికి లోపల భయంకరమైన కన్ను కనిపించింది. ఈ పోస్టర్‌లు సినిమాపై భారీ అంచనాలలు పెంచుతున్నాయి. అజనీష్ లోక్‌నాథ్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌‌కు సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed