- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో వివాదంలో మంగ్లీ.. గుట్టుచప్పుడు కాకుండా ఆ వీడియో తీసిందంటూ
దిశ, సినిమా: సింగర్ మంగ్లీ ఆడిపాడిన ఈ ఏడాది శివరాత్రి పాట వివాదంలో చిక్కుకుంది. సుద్దాల అశోక్ తేజ్ రచించిన ఈ సాంగ్ వీడియోను శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో షూట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముక్కంటి ఆలయంలో డ్యాన్స్ చేయడానికి అనుమతి లేదు కదా? ఎందుకలా చేశారంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు రెండు దశాబ్దాలుగా ఇలాంటి వాటికి అనుమతి లేని ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరించిన వీడియోను యూట్యూబ్‌లో ఎలా విడుదల చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇక ముక్కంటి ఆలయంలోని స్వామివారి సన్నిధి నుంచి నటరాజస్వామి విగ్రహం వరకు మధ్యలో ఉన్న ప్రదేశంలో మంగ్లీ నృత్యం చేసినట్టుగా ఆ ఆల్బమ్‌లో కనిపిస్తుండగా.. రోజూ సాయంత్రం 6 గంటలకు రాహుకేతు పూజలు ముగిసిన తర్వాత మండపాన్ని మూసివేస్తారు. ఈ క్రమంలో మంగ్లీ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా మండపాన్ని తెరిచి సహకరించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.