ధనుష్ రాయన్ మూవీ ట్రైలర్ పై రెస్పాన్స్ ఇదే!

by Jakkula Samataha |
ధనుష్ రాయన్ మూవీ ట్రైలర్ పై రెస్పాన్స్ ఇదే!
X

దిశ, సినిమా : తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో రాయన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ పై మంచి స్పందన వస్తుంది. రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో అడవిలోని పులి సింహేనని కానీ ప్రమాదకరమైన జంతువుల తోడేళ్లు కూడా ఉంటాయంటూ అనే డైలాగ్‌తో ట్రైలర్‌లో మొదలు అవుతుంది. ఇక ఈ ట్రైలర్‌లో ధనుష్ మొత్తం యాక్షన్ సీన్స్‌లోనే కనిపించి ఆకట్టుకున్నాడు.

ఇక ధనుష్ 50వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌పై నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. పక్కా యాక్షన్ మూవీతో ధనుష్ తమ అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ట్రైలర్ అదిరిపోయింది, హీరో ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు, ట్రైలర్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed