- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహ్వానం అందినా.. ప్రభాస్- తారక్ అయోధ్యకు వెళ్లకపోవడానికి బలమైన కారణమే ఉంది?
దిశ, సినిమా: నిన్న (జనవరి 22) బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కోరుకున్న 500 ఏళ్ల నాటి కల నిన్న నెరవేరడంతో అయోధ్యకు పెద్ద ఎత్తున జనాలు తరలి వెళ్లారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. సినీ ప్రముఖ సెలబ్రిటీలు.. చిరంజీవి ఫ్యామిలీ(మెగాస్టార్ సతీమణి, కొడుకు, కోడలు), పవర్ స్టార్ పవన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సుమన్ వంటి నటులు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాజరయ్యారు. బాలీవుడ్ అగ్ర హీరోలైన.. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మాధురి దీక్షిత్, జాకీష్రాఫ్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురాన్, అలియా భట్, రాజ్ కుమార్ హిరానీ మహావీర్ జైన్, రోహిత్ శెట్టి.. పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వీరితో పాటు కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు కూడా రామయ్యను దర్శించుకున్నారు. ప్రస్తుతం అయోధ్యలో ఈ సెలబ్రిటీలు సందడి చేసిన పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ అద్భుత ఘట్టానికి ఆహ్వానం అందినా టాలీవుడ్ స్టార్ హీరో జూనీయర్ ఎన్టీఆర్ అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు ఎందుకు వెళ్లలేదంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ అయోధ్యకు చేరుకుని తెగ సందడి చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఎన్టీఆర్ కార్యక్రమంలో కనిపించకపోయేసరికి కారణమేంటి? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
తారక్ అయోధ్య వెళ్లకపోవడానికి ‘దేవర’ షూటింగ్ ప్రధాన కారణమని చెప్పుకుంటున్నారు. నిన్న ఈ చిత్రంలో ‘సైఫ్ అలీఖాన్’ తో ఓ కీలక సన్నివేశాన్ని షూట్ చేయాల్సి వచ్చిందట. ముందుగా వేసుకున్న షెడ్యూల్ ను బ్రేక్ చేస్తే ప్రోడ్యూసర్స్ ఇబ్బంది పడాల్సి వస్తుందని తారక్ ఆలోచించారట. వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఒక్క ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ రామమందిరానికి వెళ్లలేదని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక దేవర చిత్ర షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ ను గాయమవడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అయోధ్యకు వెళ్లలేకపోయారని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.