శోభితా ధూళిపాళ ఇన్‌స్టా పోస్ట్‌పై నాగచైతన్య రియాక్షన్ ఇదే.. షాక్‌లో నెటిజన్లు

by Hamsa |   ( Updated:2024-07-14 09:31:44.0  )
శోభితా ధూళిపాళ ఇన్‌స్టా పోస్ట్‌పై నాగచైతన్య రియాక్షన్ ఇదే.. షాక్‌లో నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా మేజర్, పొన్నియన్ సెల్వన్-1,2 హిట్స్ తన ఖాతాలో వేసుకుని వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే ఇటీవల శోభిత ‘మంకీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. అలాగే సోషల్ మీడియాలోనూ వరుస పోస్టులు పెడుతూ అందరినీ మైమరిపిస్తోంది. ఇక శోభిత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా టాలీవుడ్ హీరో నాగచైతన్యతో రిలేషన్‌లో ఉన్నట్లు నిత్యం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి విదేశాల్లో ఓ హోటల్‌లో కనిపించడంతో.. అంతా ప్రేమించుకుంటున్నారని ఫిక్స్ అయిపోయారు.

ఇలా చైతు, శోభిత ఎన్నోసార్లు కెమెరాకు చిక్కినప్పటికీ రిలేషన్‌షిప్ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరు తొందరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా, శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఎప్పుడూ బోల్డ్‌గా ఉండే ఈ బ్యూటీ చీరకట్టులో సంప్రదాయంగా కనిపించింది. అయితే ఈ ఫొటోలకు నాగచైతన్య లైక్ కొట్టడంతో.. వీరిద్దరి రిలేషన్‌షిప్ వార్తలు మళ్లీ జోరందుకున్నాయి. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టే పోస్టులకు లైక్స్ కొట్టుకుంటున్నారని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక శోభితను చీరలో చూసిన నెటిజన్లు షాక్ అవుతూ.. గార్జియస్ అని హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.


పలుచటి చీరలో మెరిసిపోతున్న శ్రీలీల.. హాట్, హాటెస్ట్ అంటూ నెట్టింట ప్రశంసలు

Advertisement

Next Story