Dasara: చమ్కీల అంగేసి చిందేస్తున్న నాని

by Prasanna |   ( Updated:2023-03-04 09:17:40.0  )
Dasara: చమ్కీల అంగేసి చిందేస్తున్న నాని
X

దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ఫస్ట్ లుక్ పోస్టర్‌ నుంచి టీజర్‌ వరకూ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో దేశవ్యాప్తంగా అటెన్షన్ గ్రాబ్ చేసిన సినిమాలోని మొదటి రెండు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. మార్చి 8న థర్డ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రతి ‘పెళ్లిళ్ల సీజన్‌కు జానపద పాట.. చమ్కీల అంగీలేసి’ అనే అనౌన్స్‌మెంట్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతుండగా.. నాని దసరా బుల్లోడుగా, కీర్తి సురేష్ అందాల సుందరాంగిగా కనిపించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Mahaveerudu: శివ కార్తికేయన్ ‘గాన గాన’.. పాట వింటే కాలు కదపాల్సిందే..

Advertisement

Next Story