‘Kalki’ సాధ్యం చేసి చూపించారు.. కానీ, అదొక్కటే మిగిలిపోయిందంటూ SS Rajamouli ట్వీట్..

by Hamsa |   ( Updated:2023-07-22 06:40:09.0  )
‘Kalki’ సాధ్యం చేసి చూపించారు.. కానీ, అదొక్కటే మిగిలిపోయిందంటూ SS Rajamouli ట్వీట్..
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘కల్కి-2898AD’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తుండగా.. కమల్ హాసన్, అమితా బచ్చన్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే అమెరికాలో జరుగున్న కామిక్ కాన్‌లో ఆ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్రయూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో అది చూసిన నెటిజన్లు పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డార్లింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా, దర్శకధీరుడు రాజమౌళి కల్కి ఫస్ట్ గ్లింప్స్‌పై ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘‘ గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. భవిష్యత్‌పై సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టమైన పని. కానీ, మీరు ఆ సాహసం చేశారు. అంతేకాకుండా దాన్ని సాధ్యం కూడా చేసి చూపించారు. ఇందులో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. ఒక ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. అదే రిలీజ్ డేట్’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read More: శ్రియ అందం చెక్కు చెదరలే.. ఏం థైస్ రా బాబు..

Advertisement

Next Story