బతికుండగానే చంపేశారు.. నా మీద అలాంటి పుకార్లను పుట్టిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Disha Web Desk 6 |
బతికుండగానే చంపేశారు.. నా మీద అలాంటి పుకార్లను పుట్టిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ భావన తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా హీరో శ్రీకాంత్ మహాత్మా మూవీలోని నీలాపురి గాజుల పాటతో తెలుగులో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. కెరీర్‌ దూసుకుపోతున్న క్రమంలోనే భావన పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భావన ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

కొన్ని విషయాలపై క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నేను బతికుండగానే చనిపోయానని వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా నాలుగు సార్లు అబార్షన్ అయిందని నేను చాలా మందితో ఎఫైర్స్ పెట్టుకున్నానని రూమర్స్ వచ్చాయి. చివరకు నన్ను ఓ తప్పుడు మనిషిగా కూడా సృష్టించారు. అలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు. నేను నా ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed