ఇక‌పై ఆ ఇండస్ట్రీలో ఇతర భాషల న‌టుల‌కు నో ఛాన్స్.. మారిన రూల్స్‌

by samatah |
ఇక‌పై ఆ ఇండస్ట్రీలో ఇతర భాషల న‌టుల‌కు నో ఛాన్స్.. మారిన రూల్స్‌
X

దిశ, సినిమా: ఒక సినిమా ఇండస్ట్రీలో పని దొరకకపోతే మరో ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళతారు నటీనటులు. ప్రస్తుతం చాలామంది హీరోయిన్‌ల విషయంలో అదే జరుగుతుంది. అయితే తాజాగా ‘తమిళ ఇండస్ట్రీ ఫిల్మ్‌ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ సౌత్ ఇండియా’(ఫెఫ్సీ) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇకపై త‌మిళ సినిమాల్లో త‌మిళనాడుకు చెందిన ఆర్టిస్టుల‌కు మాత్రమే ప్రాముఖ్యత‌ ఇవ్వాలని, ఇతర భాష‌ల న‌టులను ప్రోత్సహించ‌కూడ‌ద‌ని, త‌మిళ సినిమాల షూటింగ్‌ల‌ను కూడా త‌మిళ‌నాడులోనే చిత్రీక‌రించాల‌ని, అవ‌స‌ర‌మైతేనే విదేశాలు, ప‌క్క రాష్ట్రాలకు వెళ్లాలని ష‌ర‌తులు విధించింది. అలాగే అనుకున్న టైమ్‌కు మూవీ షూటింగ్ పూర్తికాక‌పోవ‌డం, బ‌డ్జెట్ పెర‌గ‌డం లాంటివి జ‌రిగితే దానికి గ‌ల కార‌ణాలను లెటర్ ద్యారా నిర్మాతలు వెల్లడించాలని ఫెఫ్సీ పేర్కొంది. ఇక మూవీకి ఎలాంటి నష్టం జ‌రిగిన పూర్తి బాధ్యత ర‌చ‌యిత‌, ద‌ర్శకుడే తీసుకోవాలని సూచించింది.

దీంతో త‌మిళ సినీ ప‌రిశ్రమ‌తో పాటు ద‌క్షిణాది సినీ ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేక‌త వ‌స్తోంది. ‘అలాంట‌ప్పుడు త‌మిళ సినిమాలను త‌మిళ‌నాడులోనే రిలీజ్ చేయాల‌ని, ప‌క్క రాష్ట్రాల్లో విడుద‌ల చేయ‌కూడ‌దు’ అని ఫెఫ్సీ రూల్స్‌పై కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తాజాగా జరిగిన ‘బ్రో’ మూవీ ప్రమోష‌న్స్‌లో స‌ముద్రఖ‌ని ‘ఫెఫ్సీ తీసుకున్న నిర్ణయం స‌రైనది కాద‌ని, త‌మిళ న‌టుల‌కే ప్రాధాన్యత‌నివ్వాల‌నే నిర్ణయం తప్పు’ అని పేర్కొన్నాడు. ‘నటులకు భాషతో సంబంధం లేదు. ఏ రాష్ట్రంలోనైనా, ఏ భాష‌లోనైనా సినిమా చేసే హక్కు న‌టీన‌టుల‌కు ఉంది’ అని సీనియ‌ర్ డైరెక్టర్ విన‌య‌న్ అన్నారు. ఇక ఇలాంటి నిర్ణయాలు సినీ ప‌రిశ్రమలో గొడవలకు దారితీస్తుండగా ఫెఫ్సీ తమ నిర్ణయం మార్చుకుంటుందో లేదో చూడాలి.

Read More: పవన్ ‘బ్రో’ టికెట్స్ రిలీజ్.. గంటలోనే అదిరిపోయే రెస్పాన్స్

Advertisement

Next Story

Most Viewed