Gopichand: నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం వారే.. గోపీచంద్ ఎమోషనల్ నోట్

by Hamsa |
Gopichand: నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం వారే.. గోపీచంద్ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో గోపీచంద్ పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. గత ఏడాది రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ఇటీవల బీమా చేశాడు. కానీ అది కూడా విజయం అందుకోలేకపోయింది. ప్రజెంట్ గోపీచంద్ ‘విశ్వం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిని శ్రీనువైట్ల తెరకెక్కిస్తుండగా.. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయ స్టూడియో బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, గోపీచంద్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ఆయన ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తి కావడంతో అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘ ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అవుతుంది. ప్రతి క్రాప్ట్‌కు నా నిర్మాతలు, దర్శకులు, సహా నటులు సిబ్బంది అందరికీ నేను ఈ ప్రయాణానికి రుణపడి ఉంటాను. నటుడిగా నేను అనుభవించిన ఈ ప్రయాణం. నేను తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను.

ఇన్నాళ్లూ మీరు నాకు చూపిన నిరంతరం మద్దతు, ప్రోత్సాహానికి మీడియా సభ్యులందరికీ, తెలుగు సినిమా జర్నలిస్టులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్లప్పుడూ నా కోసం ఉన్నందున ధన్యవాదాలు. మీ తిరుగులేని మద్దతు కోసం నా అభిమానులందరికీ పెద్ద అరుపు. మీ ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తుంది. మీరంతా ఏనాటికైనా నా పెద్ద బలం. నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం మీరే. త్వరలో మీ అందరినీ విశ్వంతో కలుస్తాను’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం గొపిచంద్ ట్వీట్ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story