- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైగర్ సినిమాతో అతిగా నష్టపోయిందెవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'లైగర్'. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టార్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, లైగర్ సినిమా బడ్జెట్, బిజినెస్, వచ్చిన నష్టాలు అన్నీ అంచనా వేసుకుంటే డైరెక్టర్ పూరి, నిర్మాత ఛార్మి నష్టపోయింది ఏమీ లేదంటున్నారు. లైగర్ మూవీని రూ.60 నుంచి 70 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించారు. అన్ని భాషల్లో కలిపి లైగర్ సినిమా రూ.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే రూ.20 నుంచి 30 కోట్ల లాభానికే లైగర్ హక్కులు విక్రయించారట. ఓటీటీ, శాటిలైట్‌తో కొంత మొత్తం రాబట్టారట.
దీంతో ఈ సినిమా ద్వారా పూరి, ఛార్మి కోట్ల రూపాయిలు వెనకేసుకున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ఎటొచ్చి ఇక్కడ నష్టపోయింది సినిమా డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు వారితో పాటుగా విజయ్ దేవరకొండ. ఎందుకంటే విజయ్ లైగర్ చిత్రాన్ని రూ.25 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అందులో విజయ్ రెమ్మూనరేషన్‌గా కేవలం 25% మాత్రమే తీసుకున్నారట. మిగిలిన 75% తీసుకోవాల్సి ఉందట. అయితే, ఇప్పటివరకు పూరి, ఛార్మి .. విజయ్ రెమ్యూనరేషన్ సెటిల్ చేయలేదని టాక్. దీంతో విజయ్ సైతం లైగర్ మూవీతో నష్టపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
Also Read : 'మీరు ఊహించగలిగేదంతా నిజమే'.. అనన్య మిర్రర్ సెల్ఫీ
Also Read : 'Brahmastra'ను ముంచేసిన గణేశుడు.. కోట్లలో నష్టపోయిన మేకర్స్
Also Read : 'Sita Ramam ' ఓటీటీ స్ట్రీమింగ్
- Tags
- Liger