Bigg Boss 8 Promo : సోలో ఎంట్రీ ఈ సీజన్లో లేదంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్ కంటెస్టెంట్స్‌ వీళ్లే..

by Prasanna |   ( Updated:2024-09-01 14:14:58.0  )
Bigg Boss 8 Promo : సోలో ఎంట్రీ ఈ సీజన్లో లేదంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్ కంటెస్టెంట్స్‌ వీళ్లే..
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ 8 గ్రాండ్ లాంచ్ ప్రోమో వచ్చేసింది. ఈ సీజన్ అన్ని సీజన్ల కంటే కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సారి మనం ఊహించని ట్విస్ట్‌లు చాలానే ఉన్నట్టు తెలుస్తుంది.అయితే, కంటెస్టెంట్స్‌ని ఫేసులను కనిపించకుండా ప్రోమో రిలీజ్ చేశారు.. వాళ్ల మాటలు వింటుంటే మనకి బాగా తెలిసి వాళ్ళ లాగే ఉన్నారు.. సాయంత్రం వరకు వెయిట్ చేస్తే హౌస్‌లోకి ఎవరెవరు వెళ్తున్నారో తెలుస్తుంది. ప్రోమోలో హైలెట్ ఇవే..

నేను మీ కళ్లల్లోకి చూడలేను.. ఎందుకంటే ఎక్కడ కొట్టుకుని పోతాననే భయం సార్ అని బేబక్క అన్నది. ఈమె మొదటి రోజే మొదలు పెట్టింది పులిహోర కలపడం.. కానీ నాగార్జున ముందు ఏ పప్పులు ఉడకవని తర్వాత తెలుసుకుందని నెటిజన్స్ అంటున్నారు.

ఏంటి హౌస్‌లో ఎవరినైనా పార్టనర్‌ని వెతుక్కుంటున్నావా? అంటూ నాగార్జున సీరియల్ హీరో నిఖిల్‌ని అన్నాడు. నన్ను శత్రువుగా చూస్తే .. ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ఎత్తుకెళ్లిపోతా అని శేఖర్ బాషా అన్నాడు. నేను మీకు చెప్పినట్టే.. ఈ సీజన్లో సోలో ఏంట్రీ లేదు.. జంటగా మాత్రమే వెళ్లాలంటూ ఆడియెన్స్ కి , కంటెస్టెంట్స్‌ బిగ్ షాక్ ఇచ్చారు. ఈ ప్రోమో పై నెటిజెన్స్ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. మీరు కపుల్స్ లాగే వెళ్లండి.. మీ ఇష్టమొచ్చినట్టు మీరు కథలు నడిపించుకోండి.. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వాళ్లకి ఇవ్వండని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null