Mega Family లోని ఆ నలుగురు స్టార్లతో నటించిన ముద్దుగుమ్మలు వీళ్లే..!

by Javid Pasha |   ( Updated:2023-01-22 12:28:56.0  )
Mega Family లోని ఆ నలుగురు స్టార్లతో నటించిన ముద్దుగుమ్మలు వీళ్లే..!
X

దిశ, వెబ్ డెస్క్: మెగా ఫ్యామిలీ. పరిచయం అక్కర్లేని సినీ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో అందరూ స్టార్ హీరోలే. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. మెగా ఫ్యామిలీతో నటించే అవకాశం రావడం అంటే అంతా ఈజీ కాదు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలతో నటించడానికి హీరోయిన్లు తెగ ఇష్టపడుతుంటారు. వాళ్లలో ఒక్కరితో ఒక్క సినిమాలో నటించినా చాలు కెరీర్ సెట్ అయిపోతుందని హీరోయిన్ల నమ్మకం. మరీ అలాంటిది ఆ ఫ్యామిలీలోని నలుగురు స్టార్ హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో నటించే అవకాశం దొరికితే ఆ కిక్కే వేరు. అలాంటి అవకాశాన్ని దక్కించుకున్న ఆ హీరోయిన్లు ఎవరో చూద్దామా.


1. తమన్నా భాటియా

అందానికి కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే ఈ మిల్క్ బ్యూటీ మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో కలిసి నటించింది. తమన్నా మెగా ఫ్యామిలీలో ముందుగా అల్లు అర్జున్ తో కలిసి 'బద్రినాథ్'లో నటించింది. తర్వాత రామ్ చరణ్ తో కలిసి 'రచ్చ' చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో 'కెమెరామేన్ గంగతో రాంబాబు'లో ఆడిపాడింది. ఇక ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి'లో ప్రియురాలిగా కనిపించింది. ప్రస్తుతం మెగాస్టార్ తో భోళా శంకర్ చేస్తోంది.


2. కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మెగా ఫ్యామిలీలోని చాలా మంది హీరోలతో నటించింది. రామ్ చరణ్ తో 'మగధీర'లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తర్వాత 'నాయక్' సినిమాలో చెర్రీతో రెండోసారి జతకట్టింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో చెర్రీతో కలిసి మూడోసారి 'గోవిందుడు అందరివాడేలే' లో యాక్ట్ చేసింది. ఇక సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తో కలిసి 'ఆర్య 2' చేసింది. పవన్ కల్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' చేసింది. చివరిగా మెగాస్టార్ తో 'ఖైదీ నెంబర్ 150'లో ఆడిపాడింది.


3. శ్రుతి హసన్

అగ్రహీరో కమల్ హసన్ డాటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చినా.. యాక్టింగ్ లో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ శ్రుతి హసన్. ఈమె కూడా మెగా ఫ్యామిలీలోని ఆ నలుగురు స్టార్ హీరోలతో నటించింది. ముందుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో 'గబ్బర్ సింగ్'లో నటించి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. తర్వాత అల్లు అర్జున్ తో 'రేసు గుర్రం'లో నటించి మరో హిట్ కొట్టింది. ఇక మెగా పవర్ స్టార్ తో కలిసి 'ఎవడు'లో యాక్ట్ చేసి ఇంకో విజయం సాధించింది. చివరిగా మెగాస్టర్ చిరంజీవితో 'వాల్తేర్ వీరయ్య'లో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ రకంగా మెగా ఫ్యామిలీకి ఈ అమ్మడు లక్కీ హీరోయిన్ గా మారింది.

ఇవి కూడా చదవండి : ఆ లైసెన్స్ విషయంలో కొట్టుకున్న స్టార్ హీరోలు..!(వీడియో)


Advertisement

Next Story

Most Viewed