- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు నాకు మాటలు రాలేదంటూ ఎమోషనల్ అయిన Vijay Deverakonda..
దిశ,వెబ్ డెస్క్ : ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య కలిసి నటించిన సినిమా బేబీ. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా ఈ మూవీ టీం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌కు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
''ఈ మూవీ టీమ్ సాధించిన విజయాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నా. ఓ ప్రేక్షకుడిగా, ఆనంద్ సోదరుడిగా ఈ విజయాన్ని నేనూ ఆస్వాదిస్తున్నా. బేబీ సినిమాని నేను జులై 13 న చూశా. సినిమా చూడటం అయిపోయాక.. నేనేం చెబుతా అని.. ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్ ఆసక్తిగా ఎదురుచూశారు. నాకు సినిమా బాగా నచ్చిందని చెప్పడానికి.. అప్పుడు మాటలు రాలేదు. నేనే కాదు థియేటర్ నుంచి బయటకొస్తున్న ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. సాయి రాజేశ్ విజన్ ఉన్న దర్శకుడు. నేను ఒక యాక్టర్‌ని అని మరిచిపోయేలా చేసింది ఈ సినిమా. సాయి రాజేశ్ తీయబోయే తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అంటూ విజయ్ తెలిపారు.
Also Read: భార్యకు దొరకకుండా ఆ పని చేసిన యాంకర్ రవి..పట్టేసుకున్న నెటిజన్స్?
డాక్టర్ తప్పుడు ట్రీట్మెంట్ వల్ల ప్రముఖ కమెడియన్‌కు క్యాన్సర్.. 25 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం..!