అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు పెద్ద లాయర్.. ఆమె ఎవరంటే..?

by sudharani |   ( Updated:2024-03-19 09:26:00.0  )
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు పెద్ద లాయర్.. ఆమె ఎవరంటే..?
X

దిశ, సినిమా: మెగా స్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో చిరంజీవి మేనకోడలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రియా శర్మ. ఆ ఒక్క సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది.. తర్వాత తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో బాల నటిగా రానించింది. అందులో ‘చిల్లర పార్టీ’ సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డును సైతం అందుకుంది.

ఇక 2015వ సంవత్సరంలో ‘గాయకుడు’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రియా శర్మ. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోవడంతో హీరోయిన్‌గా పెద్ద గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్‌తో ‘నిర్మలా కాన్వెంట్’ లో నటించి మెప్పించింది. అయితే.. ఈ చిత్రం పర్వలేదు అనిపించినప్పటికీ.. దీని తర్వాత మరో సినిమాలో కనిపించలేదు శ్రియా.

అయితే.. సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈమె పెద్ద లాయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2016 తర్వాత సినిమాల్లో నటించనప్పటికీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అంతే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించి మెప్పించేది. దీంతో పాటు న్యాయవిద్యను అభ్యసించిన శ్రియా శర్మ ప్రస్తుతం పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలకు అడ్వకేట్‌గా కొనసాగుతోంది. అంతే కాకుండా కొంచెం బొద్దిగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

Read More..

శాశ్వతంగా ముంబయిని వీడబోతున్న విరాట్-అనుష్క.. పిల్లలతో ఎక్కడ సెటిల్ అవ్వబోతున్నారంటే?

Advertisement

Next Story

Most Viewed