Bhagyashri Borse: ఫస్ట్ మూవీ విడుదల కాకముందే మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. ఆ హీరో సరసన

by Kavitha |
Bhagyashri Borse: ఫస్ట్ మూవీ విడుదల కాకముందే మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. ఆ హీరో సరసన
X

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ మూవీలో కొత్త బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి 2 పాటలు విడుదల కాగా హిట్ టాక్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ యంగ్ హీరోయిన్‌కి తెలుగులో మరో క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ మూవీ విడుదల కాకముందే ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. విజయ్ దేవరకొండ హీరోగా, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా VD 12 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ స్పై థ్రిల్లర్‏లో మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఆమె ఇన్ స్టా స్టోరీలో శ్రీలంకలోని కొలంబోలో షూటింగ్ పిక్‏ను షేర్ చేసింది. దీంతో VD12లో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎప్పటినుంచో ఈ సినిమాపై చాలా రూమర్స్ వినిపిస్తుండగా.. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇక తెలుగులో ఇది భాగ్యశ్రీకి రెండో సినిమా. కాగా VD 12 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.



Next Story

Most Viewed