ఆ అమ్మాయి ప్రియుడితో గొడవ పెట్టుకున్న యంగ్ హీరో.. రోడ్డు మీదే అలా చేస్తూ..

by Vinod kumar |   ( Updated:2023-03-02 05:46:39.0  )
ఆ అమ్మాయి ప్రియుడితో గొడవ పెట్టుకున్న యంగ్ హీరో.. రోడ్డు మీదే అలా చేస్తూ..
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య గురించి పరిచయం అక్కర్లేదు. తన అందం నటనతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా నాగశౌర్య ఈరోజు ఉదయం హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక ప్రేమ జంట పట్ల ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. విషయమేమిటంటే.. రోడ్డు మీద ఇద్దరు లవర్స్ గొడవ పడుతున్నారు. అబ్బాయి బలంగా అమ్మాయి చెంపమీద కొట్టాడు.

దీంతో అటుగా కారులో వెళ్తున్న నాగశౌర్య ఈ జంటను చూసి వెంటనే కారు దిగి వాళ్ల వద్దకు వచ్చాడు. ‘ఆ అమ్మాయిని ఎందుకు కొడుతున్నావ్’ అని అడిగాడు. దానికి ‘నా లవర్ నా ఇష్టం. నీకెందుకు’ అని పొగరుగా ఆ అబ్బాయి సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో నాగశౌర్య ఆ అబ్బాయి చేయి పట్టుకుని ‘మర్యాదగా అ అమ్మాయికి సారీ చెప్పు’ అని హెచ్చరించాడు. అలా ఇద్దరు చాలా సేపు రోడ్డుపై గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed