- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR: ‘దేవర’ ట్రైలర్ దెబ్బకు యూట్యూబ్ షేక్.. ఎన్ని వ్యూస్ సాధించిందంటే? (పోస్ట్)
దిశ, సినిమా: ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. అయితే ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. దేవర మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందులోంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, రెండు సాంగ్స్ భారీ రెస్పాన్స్‌కు దక్కించుకున్నాయి. ఇక సెప్టెంబర్ 10న అన్ని భాషల్లో విడుదలైన ట్రైలర్ అంచనాలను డబుల్ చేసింది.
అంతేకాకుండా భారీ వ్యూస్‌ను రాబట్టి యూట్యూబ్‌ను షేక్ చేసింది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘సముద్రం ఉప్పొంగినప్పుడు దాని ఫలితం ఇలాగే ఉంటుంది’’ అనే క్యాప్షన్ జత చేసి దేవర ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 35 మిలియన్ వ్యూస్ సాధించినట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎన్టీఆర్ అభిమానులు సినిమా విడుదల తర్వాత బాక్సాఫీసును బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు.