Bhola Shankar teaser: హద్దుల్లేవ్ అంటూ ‘భోళా శంకర్’ నుంచి అదిరిపోయే టీజర్

by samatah |   ( Updated:2023-10-02 08:08:27.0  )
Bhola Shankar teaser: హద్దుల్లేవ్ అంటూ ‘భోళా శంకర్’ నుంచి అదిరిపోయే టీజర్
X

దిశ, సినిమా : చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ మొత్తం యాక్షన్ కమ్ సిస్టర్ సెంటిమెంట్‏తో సాగుతుండగా.. చిరు మార్క్ కామెడీతోపాటు మాస్ యాక్షన్ కూడా అదిరిపోయింది. ‘స్టేట్ డివైడ్ అయినా.. అందరు నావాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై.. నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్..’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more:

‘షికారు కొచ్చిన షేర్‌ను బే’.. అదిరిపోయిన ‘భోళా శంకర్’ టీజర్

Advertisement

Next Story