సడెన్‌గా ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేసి షాకిచ్చిన స్టార్ లేడీ సింగర్.. పోస్ట్ వైరల్

by Dishafeatures1 |
సడెన్‌గా ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేసి షాకిచ్చిన స్టార్ లేడీ సింగర్.. పోస్ట్ వైరల్
X

దిశ,సినిమా: ఒకే ఒక్క పాటతో ఫేమస్ అయిన సింగర్స్ ని మనం చూస్తుంటాం. వాళ్లలో శ్రీ లలిత కూడా ఒకరు. శ్రీ లలిత కుటుంబంలో తాత ముత్తాతలు సంగీత విద్వాంసులు. ఆమె లిటిల్‌ చాంప్స్‌, పాడుతా తీయగా, బోల్‌ బేబీ బోల్‌, స్వరాభిషేకం.. ఇలా చాలా రియాలిటీ షోలో పాల్గొని తన ప్రతిభను కనపరిచింది. అయితే లలిత 'కాంతార' సినిమా పేరు చెప్పగానే క్లైమాక్స్‌లో వచ్చే 'వరహారూపం' పాటని తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంది. దాదాపు ఏడాది క్రితం యూట్యూబ్‌లో ఆ వీడియో పోస్ట్ చేయగా.. దాదాపు 8.5 మిలియన్ వ్యూస్ తో తెలుగులో చాలా ఫేమ్ సంపాదించారు.

ఇప్పుడు ఈమెనే సీతారామ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుని సర్‌ప్రైజ్ చేశారు. తనకు కాబోయే వ్యక్తిని కాస్త డిఫరెంట్‌గా అందరికీ పరిచయం చేశారు. ఓ పాటతో వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

ఆనాడు ఎవరూ.. అనుకోనిది..

ఈనాడు మనకు.. నిజమైనది..

ఆ రామాయణం..మన జీవన పారాయణం' అని చెబుతూ తనకు కాబోయే వాడిని నెటిజన్లకు శ్రీ లలిత పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ను చూసిన తన ఫాలోవర్స్ వారికి అభినందనలు తెలుపుతున్నారు.

ఆమె తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పాటలు పాడుతుంది.



Next Story

Most Viewed