స్వయంగా స్కూల్ పిల్లల కాళ్లకు చెప్పులు తొడిగిన స్టార్ హీరోయిన్!

by Anjali |   ( Updated:2023-08-04 03:23:11.0  )
స్వయంగా స్కూల్ పిల్లల కాళ్లకు చెప్పులు తొడిగిన స్టార్ హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సమాజానికి ఉపయోగపడేలా చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సినీ నటులు ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా నటి మాళవిక శర్మ తన చేతులతో స్కూల్ పిల్లలకు చెప్పులు తొడుగుతూ కనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది. కాగా, రాజస్థాన్‌లో ఉన్న దేవ్‌గడ్‌లో ఉన్న 40స్కూళ్లకు దేవ్ శ్రీ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అందిస్తోంది ఈ నటి. ఈ ట్రస్ట్ సపోర్ట్‌తో ఎన్నో పాఠశాలలను సందర్శంచింది. విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులను అందచేస్తూ తనవంతు సాయం చేస్తోంది. ఈ క్రమంలో మాళవిక పెద విద్యార్థులకు చెప్పులు దానం చేసింది. అలాగే ఆ చెప్పులను కింద కూర్చుని మరీ పిల్లల కాళ్లకు తొడిగి గొప్ప మనసు చాటుకుంది. మీరు కూడా స్కూల్లో పేద విద్యార్థులకు సహాయం చేయండి అంటూ ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మాళవికపై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

Also Read: మా అమ్మకు లోదుస్తులు కూడా నేనే తీసుకొస్తా.. Karan Johar కామెంట్స్ వైరల్

Advertisement

Next Story

Most Viewed