' JacquelineFernandez ' డిప్రెషన్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-07-25 09:37:55.0  )
 JacquelineFernandez  డిప్రెషన్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధుకు సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ సెలబ్రీటీలపై నిత్యం పలు వివాదాస్పద పోస్టులు పెడుతూ దుమారం రేపుతుంటాడు. అంతేకాకుండా పలు కొత్త సినిమాలకు రివ్యూస్ ఇస్తూ రచ్చ చేస్తుంటాడు.

తాజాగా, ఓ హీరోయిన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ‘‘జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఆమెను సినిమాల్లోకి తీసుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఆమెకు ఏం పని లేదు. ఆమె మేకప్ ఆర్టిస్ట్ షాన్ ప్రకారం.. ఆమె గత నెలలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు జాక్వెలిన్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ సుకేష్ మాత్రమే కాపాడగలడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ MORE

నేను పోర్న్ స్టార్ అవ్వాలనుకున్నా.. హీరోయిన్ రెజినా షాకింగ్ కామెంట్స్?

Advertisement

Next Story