గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్ (వీడియో వైరల్)

by Hamsa |   ( Updated:2023-06-09 05:43:28.0  )
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ‘సార్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ధనుష్ ఓ న్యూ లుక్‌తో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాడు. ముంబై ఎయిర్ పోర్ట్‌లో పెరిగిన జుట్టు, గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. అంతేకాకుండా నల్లటి అద్దాలు ధరించి ఉండటంతో అతనిని వెంటనే గుర్తుపట్టలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ధనుష్ న్యూ లుక్ సినిమా కోసమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్ని ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 1930-1940 మధ్య కాలం నాటి వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ హీరో సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు ఇవే!

Advertisement

Next Story