- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సినిమా పనుల్లో బిజీ అయిపోయిన మంత్రి మల్లారెడ్డి

దిశ, సినిమా : కింగ్ డమ్ మూవీస్ పతాకంపై ఘర్షణ శ్రీనివాస్ సమర్పణలో రమణారెడ్డి గడ్డం దర్శకత్వంలో విశాల పసునూరి నిర్మిస్తోన్న చిత్రం ‘సిఐ భారతి’. నరేంద్ర, గరిమా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి మల్లారెడ్డి మేకర్స్‌కు స్క్రిప్ట్ అందజేయగా.. నటుడు అలీ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టాడు.
అనంతరం మాట్లాడిన దర్శకుడు.. రొటీన్‌కు భిన్నంగా తెరకెక్కిస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి మల్లా రెడ్డి, అలీ రావడం సంతోషంగా ఉందన్నాడు. అలాగే ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిపాడు. చివరగా ఇంత మంచి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉందని ఘర్షణ శ్రీనివాస్ చెప్పగా.. ఇందులో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు నరేంద్ర, గరిమా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.