గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్‌ నటుడు.! నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్

by Kavitha |   ( Updated:2024-07-28 04:07:24.0  )
గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్‌ నటుడు.! నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్
X

దిశ, సినిమా: కర్నాటకలో హీరో దర్శన్ కేసు మరవక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఓ బుల్లి తెర నటుడు రెచ్చిపోయి విచక్షణ మరిచి గర్భిణిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేశాడు. రెండో పెళ్లి వద్దని అడ్డుకున్నందుకు సన్నీమహిపాల్‌ ఈ దారుణానికి ఒడికట్టాడని ఆయన భార్య హెచ్‌ఏఎల్‌(HAL) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త తనపై దాడి చేయడంతో అబార్షన్ అయ్యిందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వాపోయింది. వివరాల్లోకి వెళితే..

‘నేత్రావతి’ అనే సీరియల్‌తో పేరు తెచ్చుకున్న సన్నీ మహిపాల్‌.. ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే జనవరిలో ఫేస్‌బుక్‌ ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నట్లు నమ్మించి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఇక గర్భిణి కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి డిమాండ్‌ చేయడంతో గతనెల 15న ఓ టెంపుల్‌లో ఇద్దరికి వివాహమైంది. అలా పెళ్లైనా అనంతరం వారం పాటు తనతో కలిసి ఉన్న భర్త.. తల్లిదండ్రులను ఒప్పిస్తానని మాటిచ్చాడు. అప్పటివరకు ఇద్దరు ఫ్రెండ్స్‌గా ఉండాలని అలాగే మేనేజ్‌ చేయాలని షరతు విధించాడు. అనంతరం మంగళూరు వెళ్లి కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రుల సమక్షంలో మరో యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.

ఈ విషయం తెల్సుకున్న ఆ యువతి సన్నిమహిపాల్‌ను ప్రశ్నించడానికి అర్ధరాత్రి విజ్ఞాన నగరంలో అతడి ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సన్నిమహిపాల్‌ ఆమెపై చాకుతో దాడి చేశాడు. అనంతరం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ గొడవలో తనకు అబార్షన్‌ అయిందని భార్య తెలిపింది. మరోవైపు తనును బలవంతంగా వివాహం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించిందని ఆరోపిస్తూ సన్నిమహిపాల్‌ సదరు యువతిపై హెచ్‌ఏఎల్‌(HAL) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట దుమారం రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed