ఆయనతో రొమాన్స్ ఒక లెవెల్‌లో ఉంటుంది.. త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasanna |   ( Updated:2023-04-18 09:45:55.0  )
ఆయనతో రొమాన్స్ ఒక లెవెల్‌లో ఉంటుంది.. త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : హీరో కార్తీ తనకు మధ్య జరిగిన కొన్ని రొమాంటిక్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటోంది త్రిష. ఆమె నటించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28న విడుదలకానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటి ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘‘‘పొన్నియన్ సెల్వన్-1’లో నా పాత్రకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. అభిమానులు చూపిన ఆదరణ, ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఈ చిత్రం రెండో భాగంలో ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన అనుభూతి కలుగుతుందని నమ్ముతున్నా. పార్ట్‌ 2లో కార్తీకి, నాకు మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇందులో రసవత్తరమైన పోరాట సన్నివేశాలున్నాయి. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: టాలీవుడ్ డైరెక్టర్‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్

Advertisement

Next Story