నారా బ్రహ్మణిని మహేష్ బాబు రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే? ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం!

by Anjali |   ( Updated:2024-05-01 15:39:38.0  )
నారా బ్రహ్మణిని మహేష్ బాబు రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే? ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం!
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందుకోసం సూపర్ స్టార్ భారీ వర్కౌట్స్ అండ్ హెయిర్ కూడా తెగ పెంచేశాడు. ఇదిలా ఉంటే.. సీనియర్ హీరో బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రహ్మణిని మహేష్ బాబుకిచ్చి వివాహం చేయాలనుకున్న విషయం తెలిసిందే. ప్రిన్స్ కెరీర్ స్టార్టింగ్ లోనే వరుస హిట్స్‌తో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపాడు. కాగా బాలయ్య.. సూపర్ స్టార్‌ను తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని బాలయ్య, సూపర్‌స్టార్‌తో మాట్లాడగా ప్రిన్స్ సున్నితంగా తిరస్కరించాడట. అప్పటికే తోటి నటి హీరోయిన్ నమ్రతతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇదొక కారణమైతే మహేష్ బాబు ముందు నుంచే ఇండస్ట్రీ ఫ్యామిలీకి చెందిన ఏ అమ్మాయిని కూడా వివాహం చేసుకోవద్దని ముందే ఫిక్స్ అయ్యారట. కానీ అనుకోకుండా నమ్రతతో లవ్‌లో పడటం వల్ల హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story