దటీజ్ పవర్ స్టార్.. రీరిలీజ్ సినిమాతో రికార్డుల మోత!

by sudharani |   ( Updated:2022-12-31 02:34:52.0  )
దటీజ్ పవర్ స్టార్.. రీరిలీజ్ సినిమాతో రికార్డుల మోత!
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలోనే కలెక్షన్ల మోత మోగించిన సినిమా 'ఖుషి'. ఎస్.జే సూర్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పవన్ కల్యాణ్‌ కెరీర్‌ను మర్చేసింది. అప్పట్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ స్పెషల్‌గా మరోసారి అభిమానుల ముందుకు రాబోతుంది 'ఖుషి' సినిమా. పవన్ కళ్యాణ్ మూవీ రీరిలీజ్ అంటే అభిమానుల్లో ఉత్సాహం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ క్రమంలోనే అడ్వాన్స్ టికెట్ల బుకింగ్‌లో జల్సాను మించిపోయింది 'ఖుషి'. పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా జల్సా సినిమాను రీరిలీజ్ చేయగా.. అడ్వాస్ టికెట్ల బుకింగ్‌లో 1.25 కోట్లు రాబట్టింది. కాగా.. ఇప్పటికే ఖుషి అడ్వాన్స్ బుకింగ్‌లోనే 1.30 కోట్లు రాబట్టి జల్సా కలెక్షన్ దాటేసింది. దీంతో అన్ని షోలు ముగిసే లోగా జల్సా రికార్డులను అధికమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుంది. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'ఖుషి' అంటే అభిమానుల్లో ఆ మాత్రం ఉండాలి మరి.

Also Read..

ఖుషీ రీ-రిలీజ్: థియేటర్ల వద్ద మాస్ జాతర

Advertisement

Next Story

Most Viewed