Venkatesh: ఈ సిరీస్ మాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది: వెంకటేష్

by Prasanna |   ( Updated:2023-03-08 09:40:54.0  )
Venkatesh: ఈ సిరీస్ మాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది: వెంకటేష్
X

దిశ, సినిమా : వెంకటేశ్‌, రానా కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. ఇందులోనూ వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించనుండగా మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్స్‌ మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా ఓ సమావేశంలో పాల్గొన్న బాబాయ్, అబ్బాయిలు సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘రానా నాయుడు’ నాకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇలాంటి ఫార్మెట్‌లో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. రానాలో చాలా టాలెంట్ ఉంది. తనతో స్క్రీన్ షేర్‌ చేసుకోవడం కొత్త అనుభూతినిచ్చింది’ అన్నాడు. అలాగే ‘ఇలాంటి ప్రాజెక్ట్‌లో పని చేయడం మా ఇద్దరికీ కొత్తే. నా కెరీర్‌లో ఇప్పటి వరకు నెగెటివ్‌, పాజిటివ్‌ పాత్రలు చేశా. కానీ, ఇందులో నా క్యారెక్టర్‌లో చాలా షేడ్స్‌ ఉంటాయి. బాబాయ్‌తో తొలిరోజు సెట్లో పని చేసిన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయంటూ.. రానా చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : Kollywood: దీపావళి పండుగే టార్గెట్.. బరిలోకి దిగనున్న కోలీవుడ్ స్టార్స్

Advertisement

Next Story