Mahesh Babu :మహేశ్ బాబులో ఆ టాలెంట్ కూడా ఉందా.. టాప్ సీక్రెట్ బయటపెట్టిన ప్రొడ్యూసర్!

by sudharani |   ( Updated:2023-05-25 15:27:12.0  )
Mahesh Babu :మహేశ్ బాబులో ఆ టాలెంట్ కూడా ఉందా.. టాప్ సీక్రెట్ బయటపెట్టిన ప్రొడ్యూసర్!
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ మూవీ రీరిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మహేశ్ బాబు బాబాయ్ ఆదిశేషగిరి రావు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 4కే ప్రింట్‌ను కూడా రెడీ చేశారు. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మహేశ్ బాబు తన చేతులమీదుగా రిలీజ్ చేయడం విశేషం. మే-31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ చేయబోతున్నారు. విడుదల సమయం దగ్గరపడడంతో ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు ప్రొడ్యూసర్ ఆదిశేషగిరిరావు. ఈ క్రమంలోనే అన్న కొడుకు మహేశ్ బాబు గురించి ఎవరికీ తెలియని ఓ టాప్ సీక్రెట్‌ను బయట పెట్టారు.

‘‘మహేశ్ బాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతడు ఎంతో ప్రభావంతుడు. నమ్రతను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసింది నేనే. దీంతో మహేశ్-నమ్రతల పెళ్లి విషయంలో నా పాత్ర ఉందని చాలా మంది అనుకున్నారు. కానీ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవినే వారిద్దరి పెళ్లికి అసలు కారణం. అంతే కాదు.. మహేశ్ బాబు చాలా టాలెంటెడ్. అతడు నటుడు మాత్రమే కాదు.. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఎవరినైనా ఇట్టే ఇమిటేట్ చేయగలడు’’ అంటూ ఎవరకీ తెలియని టాప్ సీక్రెట్‌ను బయట పెట్టారు.

Advertisement

Next Story