- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘భోళా శంకర్’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ట్వీట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా ‘భోళా శంకర్’. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే.. ఈ చిత్రం ప్లాప్ కావడంతో నెట్టింట అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు చిరంజీవిని ఒప్పించడానికి నిర్మాత అనిల్ చాలా ఇబ్బంది పడ్డాడని.. చిరుకు రూ.65 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చాడని నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని చెప్పినప్పటికీ రూమర్స్ మాత్రం ఆగలేదు.
దీంతో మరోసారి స్పందించాడు నిర్మాత. ఈ మేరకు.. తన బ్యానర్ ‘ఏకే ఎంటర్ టైన్ మెంట్స్’ వేదికగా ‘‘సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వివాదాలకు, పుకార్లు పూర్తిగా బేస్‌లెస్ & సెన్స్‌లెస్. వాటిలో ఒక్క శాతం కూడా నిజం లేదు. మేము ప్రతి ఒక్కరినీ దయతో కోరుకునేది ఒక్కటే. అలాంటి వార్తలను నమ్మి అనవసర చర్చలు జరపకూడదు’’ అంటూ ఓ నోట్ రిలీజ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లుయింది. అంతే కాకుండా.. ‘భోళా శంకర్’ మూడు రోజుల్లో రూ. 26 కోట్లు పైగానే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.