SS Rajamouli to grace HIT 2 movie pre-release event

by Hajipasha |   ( Updated:2022-12-15 06:45:21.0  )
SS Rajamouli to grace HIT 2 movie pre-release event
X

దిశ, సినిమా: అడవి శేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'హిట్ 2'. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో డిసెంబర్ 2న విడుదల కానుంది. ఇక ఇప్పటికే రిలిజ్ చేసిన టీజర్స్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ప్రి రీలిజ్ ఈవెంట్‌ నవంబర్ 28న హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. కాగా ఈ వేడుకకు టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి : 'గుర్తుందా శీతాకాలం' రిలీజ్ డేట్ ఫిక్స్..!

Advertisement

Next Story