- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రూ.100 కోట్లు సాధించిన తెలుగు సినిమా.. శివ తాండవమే అంటూ పోస్టర్ రిలీజ్
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న వంటి సూపర్ హిట్స్ తర్వాత ఆయన ఇటీవల నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా.. డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్‌గా నటించగా.. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించాడు. అయితే సరిపోదా శనివారం ఆగస్టు 29న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకులను మెప్పించడంతో పాటు హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
అంతేకాకుండా ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. తాజాగా, సరిపోదా శనివారం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వెల్లడిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ఇప్పుడు సరిపోయింది. మీరంతా ఈ చిత్రాన్ని ఆదరించి.. బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచారు’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా సరిపోదా శనివారం రూ. 100 వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ‘‘బాక్సాఫీసు వద్ద శివ తాండవమే’’ అనే పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో అది చూసిన నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.