పాండిచ్చేరిలో నాగచైతన్య స్పెషల్ క్లాసులు పోస్ట్ వైరల్.. దేని కోసమో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-08-03 07:33:07.0  )
పాండిచ్చేరిలో నాగచైతన్య స్పెషల్ క్లాసులు పోస్ట్ వైరల్.. దేని కోసమో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య ఇటీవల తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ‘కస్టడీ’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పలు అంచనాల మధ్ విడుదలైనా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. అయితే నాగచైతన్య ఇటీవల వరుస ఫ్లాప్‌లను అందుకుంటున్నారు. కస్టడీ విడుదలై చాలా రోజులవుతున్నా కానీ, ఇప్పటివరకు చై కొత్త సినిమాను ప్రకటించలేదు.

తాజాగా, నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్‌కు థాంక్యూ చెబుతూ ఫొటోలను షేర్ చేశాడు. ఆదిశక్తి థియేటర్ యాక్టింగ్‌కు సంబంధించిన శిక్షణ ఇవ్వడంలో ఎంతో పేరుగాంచింది. కొత్తగా నటన నేర్చుకోవాలన్నా, లేదా ఆల్రెడీ యాక్టర్స్‌గా ఉన్న నటులే యాక్టింగ్‌లతో మరిన్ని మెలకువలు నేర్చుకోవాలన్నా అక్కడికి వెళ్తుంటారని తెలుస్తోంది. అయితే నాగచైతన్య కూడా తన తదుపరి సినిమా కోసం క్లాసులు తీసుకోవడానికి అక్కడికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆ విషయం తెలిసిన నెటిజన్లు ఇదంతా చందూ మొండేటితో చేయబోయే సినిమా కోసమేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More: Bhola Shankar : మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే!

Advertisement

Next Story