పవన్ కళ్యాణ్ చెప్పులు మోసుకొచ్చిన భార్య.. వైరల్ అవుతున్న ఫోటో!

by Jakkula Samataha |
పవన్ కళ్యాణ్ చెప్పులు మోసుకొచ్చిన భార్య.. వైరల్ అవుతున్న ఫోటో!
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ పవన్ విక్టరీని ఓ పండుగలా సెలబ్రేట్ చేసింది. అయితే ఆ వేడుకల్లో పవన్ భార్య, అన్నా లెజినోవా చేసిన పనికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇక్కడి వ్యక్తి కాకపోయినా, తాను తన భర్తపట్ల చూపించే గౌరవానికి సలాం కొడుతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా?

పవన్ భార్య అన్నా లెజినోవా విదేవీ మహిళ. ఆమెకు మన భాష కూడా సరిగా రాదు. అంతే కాకుండా విదేశీ వనిత మన సంప్రదాయాలు, పద్ధతులు సరిగ్గా తెలియవు అంటారు. కానీ ఆమె గొప్పతనం ఒక్క రోజులో తెలిసిపోయింది. పిఠాపురం నుంచి గెలుపొందిన తర్వాత పవన్ చిరు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ తాను తన అన్నయ్య చిరు, తన అమ్మగారు, సోదరీమణుల కాళ్లకు నమస్కరించారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ తన చెప్పులు విడిచారు. అయితే భార్యగా ఆయన సతీమణి అన్నా లెజినోవా బావగారి ఆశీర్వాదం తీసుకుని, తన భర్త చెప్పులను తన చేతిలో పట్టుకుని పక్కకు నిలబడ్డారు. పవన్ తన తల్లి, సోదరిల కాళ్లకు నమస్కరించిన తర్వాత తన చేతిలోని చెప్పులను పవన్ కళ్యాణ్‌కు ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అన్నా లెజినోవా గొప్పతనానికి ఇదే నిదర్శనం, తాను అంత మంచి అమ్మాయి కాబట్టే పవన్ భార్యగా చేసుకున్నారు. విదేశీ మహిళ అయినా ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story