కాజల్ అగర్వాల్ కాపురంలో చిచ్చు పెట్టిన ఆ ముగ్గురు హీరోయిన్స్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు!

by Hamsa |
కాజల్ అగర్వాల్ కాపురంలో చిచ్చు పెట్టిన ఆ ముగ్గురు హీరోయిన్స్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగా ఇండస్ట్రీకి దూరమైంది. గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే బాబు పుట్టిన తర్వాత కాజల్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘సత్యభామ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, కాజల్ కాపురంలో ముగ్గురు హీరోయిన్ చిచ్చు పెట్టినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.

దానికి కారణం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన భర్తకు ఓ ముగ్గురు హీరోయిన్స్ అంటే పిచ్చి అని చెప్పడం వల్లే ఇలాంటి పుకార్లు షికారు చేస్తున్నాయి. గౌతమ్ కిచ్లుకు టాలీవుడ్ హీరోయిన్లలో రష్మిక మందన్నా, సమంత, రాశి ఖన్నా అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ కామెంట్స్ వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన వారంతా కాజల్ భర్త ఆ ముగ్గురు హీరోయిన్లని కూడా ఇష్టపడుతున్నాడు అంటే వారు కాజల్ కాపురంలో చిచ్చు పెట్టినట్టే అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

అలాగే భార్యను వదిలేసి ఆ హీరోయిన్ల వైపు చూస్తున్నాడని అంటున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం అందరికీ ఎవరో ఒకరి విషయంలో ఏదో ఒక అలవాటు లేదా నటన, అందం వంటివి నచ్చుతాయి. అలాగే గౌతమ్‌కూడా వారి నటన అంటే ఇష్టం కావొచ్చు. దానికి ఇలాంటివన్నీ అనడం ఏంటని కొట్టి పారేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed