Game Changer : 'గేమ్ ఛేంజర్' నయా షెడ్యూల్ అప్పుడేనా..!

by Shiva |   ( Updated:2023-07-11 06:48:31.0  )
Game Changer : గేమ్ ఛేంజర్ నయా షెడ్యూల్ అప్పుడేనా..!
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా, పవర్ స్టార్ రాం చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ వస్తున్న పవర్ ప్యాక్ మూవీకి గేబ్ 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ హీరో రాంచరణ్ కు 15వ సినిమా. తాజా అప్ డేట్ ప్రకారం గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్ జూలై 11 నుంచి ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవ్వనున్నట్లు సమచారం. షూటింగ్ దాదాపుగాహైదరాబాద్‌లోనే కొనసాగుతంది. ఈ కీలక షెడ్యూల్‌లో కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలను మూవీ మేకర్స్ చిత్రీకరించనున్నారు.

ఈ మెగా కాంబోలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌.జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి ఎస్. థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. దిల్ రాజు తన హోం బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై మూవీని నిర్మిస్తున్నారు.

Read More: ‘సామజవరగమన’ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. కానీ!

Advertisement

Next Story