శ్రీముఖిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడిగిన నెటిజన్.. షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన హాట్ యాంకర్ పోస్ట్ వైరల్

by Hamsa |
శ్రీముఖిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడిగిన నెటిజన్.. షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన హాట్ యాంకర్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు వరుస షోస్ చేస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్శించింది. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి తన టాలెంట్ నీరూపించుకుంది. కానీ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతోనే మరేదైనా కారణంతోనో మూవీస్‌కు గ్యాప్ ఇచ్చిన శ్రీముఖి బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతూ దుమ్మురేపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన పోస్టులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీముఖి ఇన్‌స్టా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ పెళ్లి గురించి అడగ్గా వెంకటేష్ లక్ష్మి సినిమాలో బ్రహ్మానందం ఓ సీన్‌లో తనను కొట్టడానికి హీరో రావడంతో భార్యను లోపలికి పో అంటే తను వెళ్లను అంటుంది. దీంతో బ్రహ్మీ హో రామ్ అంటాడు. ఈ ఫన్నీ వీడియోను శ్రీముఖి షేర్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. తొందరలో లేదా చేసుకోకుంటే లేదు అని చెప్పకుండా వెరైటీగా పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని చెప్పడంతో లైఫ్‌లో చేసుకోదా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో నెటిజన్ తన వయస్సు అడగ్గా .. 31 అని చెప్పింది. ఆ తర్వాత పవన్‌తో దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం శ్రీముఖి చిట్ చాట్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed