Pawan Kalyan ఫ్యాన్స్‌కు డబుల్ ఆఫర్..

by Nagaya |   ( Updated:2022-12-01 15:49:25.0  )
Pawan Kalyan ఫ్యాన్స్‌కు డబుల్ ఆఫర్..
X

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తే వారి సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా మహేష్ బాబు ఫ్యాన్స్ తో మొదలైంది. ఈ సందర్భంగా 'పోకిరి' సినిమా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది. తర్వాత పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీస్ 'జల్సా' , 'తమ్ముడు' సినిమాలను కూడా అత్యధిక థియేటర్లలో విడుదల చేయగా, అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివచ్చి విజయవంతం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 'జల్సా' సినిమా కన్నా 'ఖుషి' సినిమా ఎంతో అద్భుతమైన సినిమా. ఈ నేపథ్యంలో 'ఖుషీ' మూవీని కూడా రీ రిలీజ్‌కు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నట్లు డేట్ కన్ఫర్మ్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్‌గా ఓ టాక్ ఫ్యాన్స్ నడుమ మంచి హాట్ టాపిక్‌గా నడుస్తుంది. అదేంటంటే 'ఖుషి' రిలీజ్‌తో పాటు.. అదే రోజు పవన్ అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు' నుంచి మేకర్స్ కొత్త టీజర్‌ను విడుదల చేయనున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

READ MORE

తన భార్య ప్లేస్‌లో ఆ హీరోయిన్‌ను ఊహించుకుంటున్న స్టార్ హీరో

Advertisement

Next Story

Most Viewed