విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ మూవీ వాయిదా.. హింట్ ఇచ్చిన మేకర్స్!

by Hamsa |
విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ మూవీ వాయిదా.. హింట్ ఇచ్చిన మేకర్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రజెంట్ వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రజెంట్ విశ్వక్, రవితేజ ముళ్ళపూడి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ‘మెకానిక్ రాకీ’ నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. దీంతో విశ్వక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ క్రమంలో.. తాజాగా, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ వాయిదా పడినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కారణం తెలియనప్పటికీ ఈ సినిమా నవంబర్ 7 తేదీన విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఓ కొత్త పోస్టర్ విడుదల చేస్తూ రిలీజ్ తేదీని తొలగించి షేర్ చేశారు. దీంతో ఈ మూవీ వాయిదా పడినట్లు హింట్ ఇచ్చేశారని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై మేకర్స్ స్పందిస్తే కానీ అసలు విషయంపై క్లారిటీ రాదు.

Advertisement

Next Story

Most Viewed