'Liger' టికెట్ ధరలు.. సామాన్యుడికి అందుబాటులో ఉండేనా?

by Hamsa |   ( Updated:2022-08-19 10:45:32.0  )
Liger టికెట్ ధరలు.. సామాన్యుడికి అందుబాటులో ఉండేనా?
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ 'లైగర్' ఆగ‌స్టు 25న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో టికెట్ ధరలపై చర్చలు జరుపుతున్నారు మేకర్స్. క‌రోనా త‌ర్వాత సినిమాల‌ టికెట్ల ధ‌ర‌ల‌ు అమాంతం పెరిగిపోవడంతో థియేటర్స్‌కు రావడం మానేశారు జనాలు. దీంతో 'లైగర్' టికెట్ ధరలు ఏవిధంగా ఉండబోతున్నాయోనని ప్రేక్షకులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా TS మ‌ల్టీప్లెక్స్ లో రూ.300, సింగిల్ స్క్రీన్స్ రూ.175 గా ధ‌ర‌లు నిర్ణయించ‌నున్నట్లు స‌మాచారం. AP లోని మ‌ల్టీప్లెక్స్ లో రూ.177, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110 ఉండే అవ‌కాశం ఉన్నట్లు స‌మాచారం. ఇక ఈ నెల 20 నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానున్నాయి.

Advertisement

Next Story