Sri Devi అభిమానులకు గుడ్ న్యూస్.. బయోగ్రఫీకి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్

by Prasanna |   ( Updated:2023-02-09 17:11:25.0  )
Sri Devi అభిమానులకు గుడ్ న్యూస్.. బయోగ్రఫీకి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్
X

దిశ, సినిమా : అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి అభిమానులకు ఆమె ఫ్యామిలీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు శ్రీదేవి లైఫ్ స్టోరీని ఒక పుస్తక రూపంలో తీసుకురాబోతున్నట్లు ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ కుమార్ తెలిపాడు. 'ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్' అనే పేరుతో తొలి బయోగ్రఫీని రచించబోతున్నట్లు తాజాగా వెల్లడించిన ఆయన.. దీనికోసం శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వీ, ఖుషీ కూడా ఆనందంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రకటించాడు. అంతేకాదు ఈ విషయం చెప్పగానే 'శ్రీ దేవి ఒక అధ్బుతం. ఆమెకు నటనంటే ప్రాణం. ప్రతి సినిమాకు అభిమానులనుంచి వచ్చే రెస్పాన్స్ చూసి తెగ మురిసిపోయేది. కానీ, వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచేది. అలాంటి గ్రేట్ యాక్టర్ జీవిత చరిత్రను మా కుటుంబంలో ఒకడిగా భావించే ధీరజ్ కుమార్ బుక్ రూపంలో తీసుకురావడం మాకు గౌరవంగా ఉంది' అని బోనీ కపూర్ చెప్పినట్లు ధీరజ్ వెల్లడించాడు. ఇక శ్రీదేవి నటించిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' మూవీని ఆమె ఐదోవ వర్థంతి సందర్భంగా ఫిబ్రవరి 24న చైనాలో విడుదలచేయబోతుండటం విశేషం.

ఇవి కూడా చదవండి : ఎవరేమనుకున్నా.. అలాంటి క్యారెక్టర్లే చేస్తా: కృతిసనన్

Advertisement

Next Story