మరో 50 రోజుల్లో ‘సలార్’ విడుదల.. సెకండ్ పార్ట్ లేదంటూ ప్రచారం!

by sudharani |   ( Updated:2023-11-02 17:45:36.0  )
మరో 50 రోజుల్లో ‘సలార్’ విడుదల.. సెకండ్ పార్ట్ లేదంటూ ప్రచారం!
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం కేవలం తెలుగు అడియన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘సలార్‌’ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం రెండు భాగాలుగా విడుదల చేసేంత స్కోప్ ‘సలార్’ స్క్రిప్ట్‌‌కు లేదనే నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాను భారీ ఎత్తున రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సివుంది. దీంతోపాటుగా ఇంకో తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమా మరో 50 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇదే విషయం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది.

Advertisement

Next Story